![]()
కె.ఓ.సి ప్రాజెక్ట్ ఆఫీసర్ కు సన్మానం
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్
టేకులపల్లి మండలం లో ని కె. ఓ. సి ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రహ్లాద్ ను ఇల్లందు డివిజన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కోరం సురేందర్, అధ్యక్షుడు నల్లవెల్లి నరసింహారావు, ఉపాధ్యక్షులు బోడ మంగీలాల్ నాయక్, మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో సన్మానించారు. తదనంతరం టిప్పర్ లారీ ఓనర్స్ కు ఉన్నటువంటి సమస్యలను లెటర్ ప్యాడ్ పై రాతపూర్వకంగా పిఓ ప్రహ్లాదుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి ఏ.వేంకటేష్,గుర్రం రామరావు,బాలకృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు.


