Tuesday, March 24, 2026
HomeTelangana Newsకొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌లో కొత్త ట్విస్ట్‌!

కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌లో కొత్త ట్విస్ట్‌!

Loading

వరంగల్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ, కొండా మురళి రాజకీయ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. వరంగల్‌ రాజకీయం కాంగ్రెస్‌ పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇలాంటి తరుణంలో కొండా మురళి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.తాజాగా వరంగల్‌లో ఆర్యవైశ్య సంఘం కార్యక్రమంలో కొండా మురళి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొండా మురళి మాట్లాడుతూ..’గత ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చుపెట్టి విజయం సాధించాం. నాకు 500 ఎకరాల భూమి ఉంది.. ఎన్నికల కోసం 16 ఎకరాలు అమ్మాల్సి వచ్చింది. నా రాజకీయ జీవితంలో ఉన్నత వర్గాలతోనే నా పోటీ ఉంటుంది. వాసవి కన్యక పరమేశ్వరీ సాక్షిగా చెబుతున్నా నాకు ఎవరి పైసా అవసరం లేదు. నేను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. అలాగే, నేను ఎవరికీ భయపడను’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. గత కొద్దిరోజులుగా కాంగ్రెస్‌లో కొండా దంపతుల రాజకీయంపై ఉమ్మడి వరంగల్‌ జిల్లా హస్తం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కొండా మురళి వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇటీవల పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆయన శనివారం గాంధీభవన్‌లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. గాంధీభవన్‌కు పెద్దసంఖ్యలో కార్యకర్తలతో తరలివచ్చిన ఆయన.. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ మల్లు రవి ముందు వివరణ ఇచ్చారు. ఆరు పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించారు.అనంతరం కొండా మురళి మాట్లాడుతూ.. ”నా వ్యాఖ్యలపై మల్లు రవికి వివరణ ఇచ్చాను. కాంగ్రెస్‌ నేతలంటే నాకు గౌరవం ఉంది. కొందరు నేతలపై వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవద్దు. నేను బలవంతుడినో, బలహీనుడినో అందరికీ తెలుసు. కార్యకర్తలను పట్టించుకోవాలని మాత్రమే కోరాను. రేవంత్‌ రెడ్డి మళ్లీ సీఎం కావాలి. బీసీలకు మేలు జరగాలని 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా. రాహుల్‌ గాంధీని ప్రధాని చేయాలనే తపన మా అందరిలో ఉంది” అని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page