![]()
- భద్రాచలం ఏఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన అంకిత్ కుమార్ సంక్వార్ ఐపిఎస్
కొత్తగూడెం, మన భద్రాద్రి బ్యూరో, జులై 03
ఇటీవల తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు జరిగిన బదిలీల ప్రక్రియలో భాగంగా భద్రాచలం ఏఎస్పీగా పని చేస్తున్న పరితోష్ పంకజ్ ఐపీఎస్ పదోన్నతి పొంది కొత్తగూడెం ఓఎస్డిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా జనగాం ఏఎస్పీగా పని చేస్తున్న అంకిత్ కుమార్ సంక్వార్ ఐపిఎస్ బదిలీపై భద్రాచలం ఏఎస్పీగా ఈరోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అనంతరం ఈ ఇరువురు అధికారులు జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కలను అందజేశారు. ఈ రోజు బాధ్యతలు స్వీకరించిన అధికారులు ఇద్దరిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అభినందించారు.


