![]()
కోరం కనకయ్యకి తెలంగాణ ఉద్యమకారుల ఘనసన్మానం
- తెలంగాణ ఉద్యమకారుల కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం
ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్, జనవరి 19
ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఇల్లందు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పులిగండ్ల మాధవ రావు నాయకత్వంలో తెలంగాణ ఉద్యమకారులు అజ్మీర్ బావ్ సింగ్ నాయక్ , ఆదూరి రవి మాదిగ ఆధ్వర్యంలో నూతనంగా గెలుపొందిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకి పుష్పగుచ్చం అందించి అనంతరం శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగినది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల కోసం, మేనిఫెస్టోలో పొందపరచిన సంక్షేమ పథకాలను తెలంగాణ ఉద్యమకారులకు ఎటువంటి షరతులు లేకుండా, ప్రతి తెలంగాణ ఉద్యమకారునికి సంక్షేమ పథకాలన్నీ కేటాయించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తగుచర్యలు తీసుకోవాలని కోరుతూ, అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ పులిగండ్ల మాధవరావు నాయకత్వంలో తెలంగాణ ఉద్యమకారులు అజ్మీర భావ్ సింగ్ నాయక్, ఆదూరి రవి మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోరం కనకయ్యకి వినతి పత్రము అందజేయడం జరిగినది. అదేవిధంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య స్పందించి ఉద్యమకారులందరికీ న్యాయం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీనియర్ ఉద్యమ నాయకులు, దళిత రత్న మేకల శ్యాం మాదిగ, పరిదల నవీన్, ఎర్రబెల్లి కృష్ణయ్య, గోనెల సిద్దయ్య, బానోత్ జగదీష్, ఎస్కే ఖాజా, ముత్యాల శ్రీనివాస్, కాసాని హరిప్రసాద్ యాదవ్, ములుగునూరి రమేష్ గౌడ్, దండ రామచందర్, గుమ్మడి విద్యాసాగర్, వేమూరి సుజాత, కుక్కల అరుణ, జలపెల్లి పుల్లయ్య, ఎస్కె జాఫర్, జావేద్, మబ్బు శ్రీమన్నారాయణ, మేకల రమేష్, వెనగంటి రమణ , దాసరి సంతోష్, చింతలచెరువు మురళి, బొమ్మ సతీష్ కుమార్, పోతిరెడ్డి సారంగ పాణి, తెలుగు సుమంత్, తిరుక్కోవాల్ గురు బ్రహ్మ, దేవిశెట్టి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.


