![]()
చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్
మండలంలోని బాలికుంట మరియు బెండాలపాడు గ్రామంలో ఆదివారం గ్రామంలోని క్రీడాకారుల కోరిక మేరకు అశ్వరావుపేట నియోజకవర్గం సేవాదళ్ ప్రధాన కార్యదర్శి ఫజల్ బక్షి యువ క్రీడాకారులకు వాలీబాల్ మరియు నెట్ అందజేశారు. ఫజల్ బక్షి మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యానికి ఆనందానికి దోహదపడతాయని, అదేవిధంగా భవిష్యత్తులో ఉద్యోగాల ఎంపికలో కూడా ప్రధాన భూమిక వహిస్తాయని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు, దిశా కమిటీ సభ్యులు బొర్రా సురేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కారం చిట్టిబాబు, ఉపాధ్యక్షులు సపోవట్ రాజేష్, ప్రధాన కార్యదర్శి ఓర్సు రామకృష్ణ, మాజీ సర్పంచ్ వీసం రాములు, యువ నాయకులు పోట్టా రాము, బోడ శ్రీను, ఆంగోత్ రమేష్, ఆంగోతు కిషన్, రాయల నరేష్, గోగుల తిరుమలరావు, అయోధ్య రామయ్య, తదితరులు పాల్గొన్నారు.


