![]()
ఖమ్మంలో పకడ్బందీగా ” సిటీ పోలీసింగ్ యాక్ట్ “
- ఖమ్మం సీపీ సునీల్ దత్ ఐపీఎస్
ఖమ్మం, మన భద్రాద్రి బ్యూరో
గంజాయి వంటి వ్యవస్థీకృత నేరాల కట్టడికి ప్రణాళిక, విజబుల్ పోలిసింగ్‌తో నేరాల నియంత్రణపై దృష్టి పెట్టాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ సూచించారు. చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాల కట్టడి వంటి వాటి కోసం ఖమ్మం పోలీస్ కమిషనరేట్ లో పటిష్టంగా సిటీ పోలీసు యాక్టు అమలు చేస్తున్నట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు ప్రతేక చర్యలు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పేర్కొన్నారు. పోలీస్ కాన్ఫరెన్స్ హల్ లో జరిగిన నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలు చాలా ముఖ్యమని, మత్తు పదార్థాల రవాణా, విక్రయాలు, వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోందని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల సరఫరా మూలాలకు సంబంధించిన అన్ని అనుసంధానాలను గుర్తించి కట్టడి చేసేలానిఘా వ్యవస్థను పటిష్టం చేసినట్లు తెలిపారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ లో బహిరంగ మద్య పానం, పబ్లిక్ న్యూసెన్స్, రాష్ డ్రైవింగ్, రాత్రి సమయాల్లో సమయానికి మించి షాపులు తెరవడం, పని లేకున్నా రోడ్లపై రావడం, పుట్టినరోజు వేడుకలు రోడ్డుపై వాహనాలు అడ్డం పెట్టి ప్రజలకు అసౌకర్యం కలిగించే వారిపై సిటీ పోలీసు యాక్టు ఖచ్చితంగా అమలు చేసి కోర్టులో హాజరు పరచాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.
పాత నేరస్తుల కదలికలను నిఘా పెట్టాలని తరచూ నేరాలు చేసే కరుడుగట్టిన నేరస్తులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని సూచించారు. చోరి సోత్తు రికవరీపై సెంట్రల్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించాలని ఆదేశించారు. దీర్ఘకాలిక పెండింగ్ కేసులు, నాన్ బెయిలబుల్ వారంట్ ఎగ్జిక్యూట్, లోక్ అదాలత్ లో కక్షిదారులకు సత్వర న్యాయం, పరిష్కారాని తీసుకొవాల్సిన చోరవపై సమీక్ష నిర్వహించారు. వివిధ కేసుల దర్యాప్తుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని అన్నారు. విచారణలో వున్న గ్రేవ్ కేసుల వివరాలను, ఎస్.సి., ఎస్.టి. కేసుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. విచారణ వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. పోక్సో కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలు, పెండింగ్ ఉన్న ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్, పోస్టుమార్టం రిపోర్ట్స్, నేరస్తుల అరెస్టు చేయని కేసులలో నేరస్తులను అరెస్టు చేసి త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తిచేసి చార్జిషీట్ దఖాలు చేయాలని సూచించారు.


