Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemగిరిజన అడవి బిడ్డల అభివృద్ధికి సహకరించండి

గిరిజన అడవి బిడ్డల అభివృద్ధికి సహకరించండి

Loading

గిరిజన అడవి బిడ్డల అభివృద్ధికి సహకరించండి

చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్

గిరిజన గ్రామాలకు అభివృద్ధికి సహకరించండి అంటూ మొరపెట్టుకుంటున్న గిరిజన అడవి బిడ్డలు. వివరాల్లోకి వెళ్తే చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలోని ఇందిర జల సౌర వికాస్ పథకం లబ్ధిదారులు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిర జల సౌర వికాస్ పథకం గిరిజన బిడ్డలకు ఒక గొప్పం వరాలాంటిది. ఇలాంటి పథకం మా బెండలపాడు గ్రామానికి వచ్చినందుకు గాను మాకు ఎంతగానో ఆనందంగా ఉందని ఒకప్పుడు మా గ్రామానికి రహదారి కూడా లేదని ,ఇప్పుడు నీటి ప్రవాహం, రహదారులు, ఇప్పుడు పోడు భూములకు నీటి వసతి లభించడంపై మా గ్రామంలో గ్రామస్తులు ఆనందం వ్యక్తపరుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మా గ్రామానికి రానందుకు మాకు కొంచెం బాధాకరంగా ఉన్నా కూడా అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ కి నిన్న జరిగిన సభలో స్వయంగా మల్లు భట్టి విక్రమార్క అతి త్వరలోనే మీ గ్రామానికి వస్తున్న అని చెప్పడంతో మాకు ఆనందాన్నిచ్చిందని తెలిపారు.

సోషల్ మీడియాలో మల్లు భట్టి విక్రమార్క బోర్లు విఫలమయ్యాయని రాలేదని అధికారులు అవినీతికి పాల్పడ్డారని కొంతమంది కథనాలు ప్రచురించారు. ఈ కథనాలను మేము పూర్తిగా ఖండిస్తున్నామని వీలైతే మండలానికి గ్రామానికి అభివృద్ధి జరగాలని ప్రచురించండి అలాకాకుండా రాజకీయ కక్షపూరితతో ఇలా అసత్య కథనాలు ప్రచురించబడితే గిరిజన బిడ్డల అభివృద్ధిని అడ్డుకున్న వారవుతారు. రాబోవు రోజుల్లో బెండలపాడు గ్రామాన్ని ఒక అభివృద్ధి చెందుతున్న పట్టణంగా తీర్చిదిద్దుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఎల్లప్పుడు రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా దిశా కమిటీ సభ్యులు బొర్రా సురేష్, నియోజకవర్గ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి ఫజల్ బక్షి , నాగరాజు పద్దం వెంకటేశ్వర్లు,అంతటి రామకృష్ణ, పోడు సాగుదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page