![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, మార్చి 14
ఏజెన్సీ ప్రాంతమైన గుండాల పోలీస్ స్టేషన్ ను, బోర్డర్ గ్రామాలైన దామరతోగు, వీరాపూర్ గ్రామాలను గురువారం ఇల్లందు డిఎస్పీ చంద్రభాను సందర్శించారు.ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న పోలీసు అధికారులను ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అధికారులకు సూచించారు.సైబర్ క్రైమ్స్ పట్ల అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు.అదేవిధంగా నిషేధిత మావోయిస్టుల కదిలికలపై కూడా ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.రాబోయే పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.దామరతోగు పోలింగ్ స్టేషన్ సందర్శించి, ఎలక్షన్ సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తగు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో గుండాల సీఐ ఎల్ రవీందర్, ఎస్సై కిన్నెర రాజశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


