Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemగోదావరి పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి

గోదావరి పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి

Loading

  • జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

భద్రాచలం, మన భద్రాద్రి బ్యూరో

రాబోయే వర్షాల దృష్ట్యా భద్రాచలం వద్ద గోదావరి నది వద్ద నీటిమట్టాన్ని పరిశీలిస్తూ పెరిగే క్రమంలో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అధికారులకు సూచించారు. కూనవరం రోడ్డులో నూతనంగా నిర్మితమవుతున్న కరకట్ట నిర్మాణ పనులను పరిశీలించారు. అధికంగా వర్షాలు పడి వరదలు సంభవిస్తే ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా సన్నద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.

భద్రాచలం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

రాబోయే వర్షాల దృష్ట్యా గోదావరి నది పరిసర ప్రాంతాలను పరిశీలించిన అనంతరం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ భద్రాచలం పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. పోలీస్ స్టేషన్ కు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్లో నమోదైన పలు కేసులు వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గంజాయి రవాణా, గుట్కా, మట్కా, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నూతన న్యాయ చట్టాలపై ప్రజలకు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. బాధితులకు సత్వర న్యాయం అందేలా భాద్యతగా వ్యవహారించాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో పనిచేసే సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ సంక్వార్ ఐపిఎస్, భద్రాచలం సీఐ సంజీవరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు, ట్రాఫిక్ ఎస్సై మధుప్రసాద్, ఎస్సై విజయలక్ష్మి మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page