![]()
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, ఆగస్టు 10
టేకులపల్లి మండలం గోల్య తండా పరిధిలో ఇల్లందు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ బోడ మంగి లాల్ ఆధ్వర్యంలో శ్రావణమాసం సందర్భంగా ముత్యాలమ్మ తల్లి దేవాలయాల్లో బోనాల మహోత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పసుపు, కుంకుమలతో అందంగా అలంకరించిన బోనాలను నెత్తిన పెట్టుకుని, ప్రదర్శనగా ఊరేగింపుగా దేవాలయానికి చేరుకున్నారు. బోనాల నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి చీర, సారెలతో పాటు కోళ్లు, జీవాలను బలి ఇచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బోడ నిరోషా, మాజీ వార్డ్ మెంబర్స్ మూడ్ శాంతి, మాలోత్ అంకి, బోడ భాస్కర్, నాయకులు మూడ్ దీప్ల, బోడ రావుజీ, భూక్య శ్రీను, బోడ హరిలాల్, ప్రసాద్ భూక్య సురేష్, వాంకుడోత్ కృష్ణ, వంశీ, భీల్య, బిచ్చ, సామ్య, సుధాకర్, కుమార్, చందర్ తదితరులు పాల్గొన్నారు.


