![]()
-మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, మన భద్రాద్రి న్యూస్, మార్చి 13
హైదరాబాద్ మహా నగరంలో మంగళవారం ప్రారంభించిన గ్రీన్ మెట్రో నాన్ ఏసీ ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.ప్రస్తుతం 22 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించామని అన్నారు.ఇక నుంచి హైదరాబాద్ నగరంలో మహిళలు మెట్రో ఆర్డినరీ, సిటీ ఎక్స్ ప్రెస్ లతో పాటు ఈ గ్రీన్ మెట్రో నాన్ ఏసీ ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. మిగతా జిల్లాలలో మహిళలు పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే విషయం తెలిసిందే.


