Wednesday, March 25, 2026
HomeTelangana News"చాలా రోజుల తర్వాత మంచి వార్త''

“చాలా రోజుల తర్వాత మంచి వార్త”

Loading

”చాలా రోజుల తర్వాత మంచి వార్త”

  • స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఆసక్తికరమైన ట్వీట్

మన భద్రాద్రి న్యూస్ బ్యూరో

బిల్కిస్ బానో అత్యాచార కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న 11 మందిని గుజరాత్ ప్రభుత్వం ముందుగానే జైలు నుండి విడుదల చేస్తూ ఇచ్చిన ఆదేశాలను కొట్టేసిన సుప్రీంకోర్టు రెండు వారాల్లోగా నిందితుల మళ్లీ జైల్లో సరెండర్ కావాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు తీర్పుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లేడీ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ బిల్కిస్ బానో కేసు తీర్పుపై స్పందించారు. ఈ ఇష్యూపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆమె రియాక్ట్ అయ్యారు. ”చాలా రోజుల తర్వాత మంచి వార్త. బిల్కిస్ బానో మాత్రమే కాకుండా మహిళల అందరి విశ్వాసాన్ని పెంచింనందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు” అని స్మితా సబర్వాల్ ట్విట్ చేశారు. కాగా, 2002 గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో అనే మహిళపై సామూహిక అత్యాచారం చేసి, ఆమె కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేసిన నిందితుల్లో 11 మందిని సత్ప్రవర్తన కింద ముందుగానే గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తం కాగా, నిందితులను విడుదల చేయడాన్ని బాధితురాలు బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నిందితులను ముందుగానే విడుదల చేయడాన్ని తప్పుబట్టి, రెండు వారాల్లోగా 11 మంది జైల్లో సరెండర్ కావాలని ఆదేశించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page