![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా బీజేపీ ఎస్టీ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడిగా వడ్డేపల్లి రాంచందర్ ను ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. హుస్సేన్ నాయక్, రాంచందర్ ను నియమిస్తూ రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు జారీ చేయడంపై బీజేపీ రాష్ట్ర శాఖ తరపున శనివారం ఆమెకు ఒక ప్రకటనలో అభినందనలు తెలియజేశారు. అలాగే ప్రధాని మోడీకి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కల్యాణ్ నాయక్ అభినందనలు తెలియజేశారు. హుస్సేన్ నాయక్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు. రాంచందర్ గోదావరి ఖనికి చెందిన బీజేపీ నేతగా కొనసాగుతున్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులుగా తెలంగాణకు చెందిన వ్యక్తులను నియమించడం వల్ల ఇక్కడి ప్రజల హక్కులను కాపాడేందుకు మరింత అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తోందని పేర్కొన్నారు.


