Monday, March 23, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemజిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఐటీడీఏ లో సమీక్ష సమావేశం

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఐటీడీఏ లో సమీక్ష సమావేశం

Loading

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఐటీడీఏ లో సమీక్ష సమావేశం

భద్రాచలం, మన భద్రాద్రి న్యూస్

మలేరియా – ఎన్సివిబిడిసి మరియు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని పర్యవేక్షకుల హెల్త్ అసిస్టెంట్ మగ కార్యకర్తలకు మరియు రక్త పరీక్ష చెయ్యు ల్యాబ్ టెక్నీషియన్స్ అందరికి నెలవారి సమీక్షా మరియు ఇంటిగ్రాడెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫారం గురించి సమగ్ర శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని మలేరియా అధికారిని స్పందన అన్నారు. గురువారం నాడు ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2024 జనవరి నుండి తప్పకుండా వైద్య ఆరోగ్య శాఖ తరుపున మారుమూల గ్రామాలలో అందిస్తున్న ముఖ్యమైన మలేరియా నిర్ములన కార్యక్రమం సక్రమంగా నిర్వహించడమే కాకుండా ఐ హెచ్ ఐ పి పోర్టల్ లో ఆన్లైన్ చెయ్యాలని, ఒక్క మలేరియా మరణం కూడా జరగకుండా అందరూ మారుమూల గ్రామాలలో మంచి సేవలు అందించాలని చెప్పడం జరిగింది.

మలేరియా నిర్ములన మరియు సహాయ మలేరియా అధికారి మాట్లాడుతూ 2024 నూతన సంవత్సరంలో ఉత్సాహంగా అందరం పనిచేసి మారుమూల గ్రామాలలో వైద్యసేవలు అందించాలని దిశానిర్దేశం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో మలేరియా అధికారి డాక్టర్ స్పందన, జిల్లా సహాయ మలేరియా అధికారి గొంది వెంకటేశ్వర్లు, ఎస్ యు ఓ వెంకటేశ్వర్లు, లింగ్యా నాయక్, కుమార్, ఐ డి ఎస్ పి నుండి హరికిషన్, రంజిత్, ఎల్ టి ఎబినైజర్, లాలూలాల్, గోపి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page