![]()
టిడిపి పార్టీ మండల అధ్యక్షుడిగా ఎడారి సత్యనారాయణ
కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం.. కొత్తపల్లి
చర్ల, మన భద్రాద్రి న్యూస్, మే 19
తెలుగుదేశం పార్టీ మండల నూతన అధ్యక్షుడిగా ఎడారి సత్యనారాయణ ఏకగ్రీవంగా సోమవారం పార్టీ పరిశీలకులు వట్టం నారాయణ దొర, కొడాలి శ్రీను, కొత్తపల్లి రామాంజనేయులు సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది.ఈ మేరకు రాష్ట్ర నాయకులు కొత్తపల్లి రామాంజనేయులు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామాంజనేయులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని,మండల అధ్యక్షుడిగా ఎడారి సత్యనారాయణ ను ఎన్నుకోవడం జరిగిందని అన్నారు.
నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న సత్యనారాయణ కు మండల కమిటీకి అభినందనలు తెలియజేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని, ప్రజలు చూపు ఎన్డీఏ కుటుంబం వైపు ఉందని అన్నారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అండగా నిలబడి ఆదుకుంటానని ఏ ఒక్క కార్యకర్త అధైర్య పడవద్దని తెలిపారు. మండల తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించడంతో మండల కేంద్రంలో కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రానున్న కాలంలో టిడిపి అధికారంలోకి వచ్చేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.


