Monday, March 23, 2026
HomeSports Newsటీమ్‌ ఇండియాలో అతడు 'రియల్ వారియర్'..

టీమ్‌ ఇండియాలో అతడు ‘రియల్ వారియర్’..

Loading

  • టీమ్‌ కోసం ఏదైనా చేస్తాడు: జో రూట్

మన భద్రాద్రి స్పోర్ట్స్ న్యూస్: ఐదు టెస్టుల సిరీస్‌లో (India vs England) చివరి మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. ఓవల్ వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో భారత్‌ విజయానికి 4 వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లాండ్‌కు 35 పరుగులు కావాలి. సిరీస్‌ను టీమ్‌ఇండియా డ్రా చేస్తుందా? ఆతిథ్య జట్టుకే వెళ్తుందా? అనేది ఇవాళే తేలనుంది. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. నాలుగో రోజు మ్యాచ్‌ అనంతరం జో రూట్ తమ గెలుపు అవకాశాలతోపాటు సిరాజ్‌ బౌలింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు.

”సిరాజ్ రియల్ వారియర్. అద్భుతమైన క్యారెక్టర్ కలిగిన క్రికెటర్. అతడిలాంటి ఆటగాడు జట్టులో ఉండాలని కోరుకుంటారు. జట్టు కోసం పరితపిస్తాడు. కొన్నిసార్లు కోపం వచ్చినట్లు ప్రవర్తించినా.. అదేమంత ఎక్కువ సమయం ఉండదు. చాలా మంచోడు. నిరంతరం కష్టపడేతత్వం కలిగిన ప్లేయర్. అద్భుతమైన నైపుణ్యం ఉంది. అందుకే ఈ సిరీస్‌లో అతడు టాప్‌ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. పనిపట్ల నిబద్ధత ఎక్కువ. అతడికి ప్రత్యర్థిగా ఆటను ఆస్వాదిస్తా. ఎప్పుడూ నవ్వుతూ ఉండే సిరాజ్‌ వికెట్ల కోసం చాలా శ్రమిస్తాడు. యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తాడు” అని రూట్ వ్యాఖ్యానించాడు.

  • పంత్‌లా వోక్స్‌ కూడా..

తొలి ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తుండగా తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. కానీ, ఇప్పుడు అవసరమైతే రెండో ఇన్నింగ్స్‌లో క్రీజ్‌లోకి వస్తాడని జోరూట్ వెల్లడించాడు. రిషభ్ పంత్ పాదానికి గాయమైనా సరే బ్యాటింగ్‌కు దిగిన సంగతి తెలిసిందే. పంత్‌తో వోక్స్‌ను పోలుస్తూ రూట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ”వోక్స్‌ చాలా నొప్పితో బాధపడుతున్నమాట వాస్తవం. అయితే, కాలికి ఫ్రాక్చర్‌ అయినా సరే ఆడిన వారిని (పంత్‌) చూశాం. ఏ ప్లేయర్‌ అయినా సరే అలాగే ఉంటారు. వోక్స్‌ కూడా అదే కోవకు చెందినవాడు. ఇంగ్లాండ్‌ కోసం ఏదైనా చేస్తాడు. అవసరమైతే మాత్రం తప్పకుండా క్రీజ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తాడు” అని ఇంగ్లాండ్‌ బ్యాటర్ వెల్లడించాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page