![]()
తిరుపతి, మన భద్రాద్రి వెబ్ డెస్క్: భక్తులారా మీరు తిరుమలకు వచ్చారా? స్వామి దర్శనానికి ఎటు వెళ్లాలో తెలియడం లేదా? ఉచిత బస్సులు సమయానికి రావడం లేదా? అన్నప్రసాద కేంద్రానికి ఎలా వెళ్లాలో తెలియదా? కల్యాణ కట్టల్లో సమస్యగా ఉందా? క్యూలైన్లలో అన్నప్రసాదాలు, నీరు అందడం లేదా? మరుగుదొడ్లలో నీటి సరఫరా లేదా? వాహన ఊరేగింపుల్లో పాల్గొన్న మీకు గ్యాలరీల్లో ఏదైనా ప్రమాదం వాటిల్లిందా? దర్శనం కోసం షెడ్లలో వేచి ఉన్న మీవారికి అస్వస్థత కలిగిందా? ఏదైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడిందా? తక్షణ సాయం కావాలా? అయితే తితిదే తిరుమలలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ నంబర్ 1800 4253535కు డయల్ చేస్తే సరిపోతుంది.
- ఏం చేస్తారంటే..
తిరుమల పీఏసీ-4లో కాల్ సెంటర్ ఉద్యోగులు, అన్ని విభాగాల ఉద్యోగులతో కామన్ ఇన్ఫర్మేషన్, కంప్లైంట్ సెల్ ఉంటాయి. దీనికి తిరుమలలో పనిచేస్తున్న అన్ని విభాగాల అధికారులకు అనుసంధానమై ఉంటారు. టోల్‌ఫ్రీ నంబరుకు వచ్చిన ఫిర్యాదులను నమోదు చేసుకొని.. భక్తులకు తక్షణ సాయంతోపాటు పరిష్కారం దొరికే వరకు సహకరిస్తారు.


