![]()
తెలంగాణ ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్ కి ఎంపికైన సోయం అనుజ్యోతిక
- అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
దమ్మపేట, మన భద్రాద్రి న్యూస్
దమ్మపేట మండలం, కొమ్ముగూడెం గ్రామానికి చెందిన సాధారణ ఆదివాసీ కుటుంబానికి చెందిన సోయం అనుక్, నాగలక్ష్మి దంపతుల కూతురు యుపిఎస్ వెంకటాద్రిగూడెం పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్న సోయం అనుజ్యోతిక తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో ఎంపిక కావడం జరిగింది. దమ్మపేట మండలంలో నుండి సోయం అనుజ్యోతిక తెలంగాణ క్రీడా పాఠశాలకు ఎంపిక అయ్యిన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటీల్ ప్రత్యేకంగా అభినందించారు. చదువుతో పాటు క్రీడలలో చక్కని ప్రావిణ్యతను సంపాదించి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకొని రావాలని జిల్లా కలెక్టర్ అన్నారు. సోయం అనుజ్యోతికకు నోట్ బుక్స్ కానుకగా అందించారు. స్పోర్ట్స్ స్కూల్ కి ఎంపిక అయిన సోయం అనుజ్యోతిక ని దమ్మపేట మండలం ఎంఈఓ లక్ష్మి, ముష్టిబండ హెచ్.ఎం సత్యప్రసాద్, హెచ్.ఎం కృష్ణమోహన్, గ్రామ పెద్దలు సోయం వీరభద్రం మరియు పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.


