Monday, March 23, 2026
HomePoliticsతెలంగాణ బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఢిల్లీ దౌత్యం..

తెలంగాణ బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఢిల్లీ దౌత్యం..

Loading

  • ఆగస్టు 05 నుంచి ఉద్యమానికి సిద్ధం అయిన ప్రభుత్వం!
  • రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆందోళన.. ఢిల్లీలో ఆందోళనలకు సిద్ధం!

తెలంగాణ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్రం ఆమోదం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా డిమాండ్ చేస్తోంది.

ఈ మేరకు ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో మూడు రోజుల పాటు బీసీ హక్కుల కోసం ఉద్యమం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.

  • రాజకీయంగా ఢిల్లీని కదిలించేందుకు ప్రణాళిక:

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి రాజధాని ఢిల్లీలో మకాం వేసి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దిశగా పావులు కదుపుతున్నారు

  • .ఆగస్టు 5న పార్లమెంట్‌లో తెలంగాణ ఎంపీలు బీసీ బిల్లుల ఆమోదంలో జాప్యం విషయంపై గళమెత్తనున్నారు.
  • ఆగస్టు 6న జంతర్ మంతర్ వద్ద సామూహిక నిరసన సభ జరుగుతుంది
  • .ఆగస్టు 7న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఆమోద అభ్యర్థన పత్రాన్ని సమర్పించనుంది.

బిల్లుల ఆమోదం ఎందుకు కీలకం?

  • 2024 మార్చిలో తెలంగాణ శాసనసభ, మండలిలో ఆమోదించిన బీసీ కోటా బిల్లులు ఇప్పటికీ కేంద్ర ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి.
  • 2018 పంచాయతీ రాజ్ చట్ట సవరణ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలునకు అవసరం అయిన ఆర్డినెన్స్‌లు కూడా ఆమోదం కోసం వేచి ఉన్నాయి.
  • జూలై 25తో హైకోర్టు విధించిన గడువు ముగియడంతో, రాష్ట్రంపై మరింత ఒత్తిడి పెరిగింది.

పొన్నం ప్రభాకర్ స్పందన:

  • బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.
  • రాష్ట్రం నుంచి 200 మందికిపైగా ప్రజా ప్రతినిధులు ఢిల్లీకి చేరుకుని రాష్ట్రపతిని కలుస్తారని చెప్పారు.
  • బీజేపీ ఎంపీలు, నేతలు కూడా పెండింగ్‌లో ఉన్న బీసీ బిల్లుల ఆమోదానికి సహకరించాలన్న పిలుపునిచ్చారు.

ఎందుకు ఈ రిజర్వేషన్లు అత్యవసరం?

  • రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో, బీసీ కోటా అమలు కీలకం.
  • విద్య, ఉపాధి, పాలన రంగాల్లో బీసీలకు సమాన హక్కులు కల్పించాలన్న లక్ష్యంతోనే 42% రిజర్వేషన్ బిల్లులు రూపొందించబడ్డాయి
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page