![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: రాబోయే 48గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై గరిష్ఠంగా 33.5 డిగ్రీలు, కనిష్ఠంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుందని వెల్లడించింది.
ఇక నిన్న కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తెలిక పాటి వర్షం కురిసింది.
తెలంగాణలో ఈ ఏడాది సరిగ్గా వర్షాలు కురవటం లేదు. ముందుగానే రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశించినప్పటికీ.. జూన్ నెలలో 28 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జులై నెలలో ఇప్పటి వరకు 13 శాతం వర్షపాతం లోటు నమోదైందని భారత వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని 340 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా.. 281 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల సమయంలో సాధారణంగా ఏర్పడే అల్పపీడనాలు గత నెల నుంచి ఏర్పడకపోవడమే ఈ లోటు వర్షపాతానికి ప్రధాన కారణమని ఐఎండీ పేర్కొంది.
మే చివరి వారం నుంచి జూన్ మొదటి వారంలో భారీగా వర్షాలు పడ్డాయి. దీంతో ఆరగాలం శ్రమించే రైతన్నలు కొత్త పంటలు వేసారు. మొదట్లో వర్షాలు బాగానే పడినా.. రాను రాను చాలా చోట్ల వర్షాలు పడక ముఖం చాటేసాయి. మరోవైపు గోదావరి, కృష్ణా బేసిన్ లలో కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అంతేకాదు పలు చోట్ల నీటి ప్రాజెక్టులు జలకళను సంతరించకున్నాయి. ఇప్పటికే కృష్ణా పరివాహాక ప్రాంతాల్లో ఉన్న శ్రీశైలం, జూరాల, నారాయణ పూర్, సుంకేశుల,ఆల్మట్టి డ్యామ్స్ నిండిపోయాయి. మరోవైపు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు నీటి ప్రవాహాం కొనసాగుతుంది. తెలంగాణలో ఇప్పటి వరకు నల్గొండలో అత్యల్పంగా నల్గొండలో 50 శాతం వర్షపాతం నమోదు అయింది. దాదాపు అన్ని జిల్లాల్లో 20 శాతం నుంచి 40 శాతం తక్కువ వర్షపాతం రికార్డ్ అయింది.


