Tuesday, March 24, 2026
HomeHyderabadతెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు..!

తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు..!

Loading

హైదరాబాద్, మన భద్రాద్రి బ్యూరో

తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. రాష్ట్రంలో అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతు పవనాలు చురుగ్గా మారడంతో రాష్ట్రంలో ఈరోజు ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణలో వర్షాలు కురుస్తాయని, అంతేగాక గంటకు 11 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో ఈదుడు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో వాతవరణ శాఖ అధికారులు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల , ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జగిత్యాల, భుపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపధ్యంలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇక హైదరాబాద్ నగరంలో కూడా మూడు రోజులు భారీ వర్షాలు కురిసే సూచలున్నాయని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page