![]()
-ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి
మన భద్రాద్రి వెబ్ డెస్క్:
మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. సోమవారం ఉదయం ఝార్ఖండ్‌లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా దళాల కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. సోమవారం ఉదయం బొకారో జిల్లాలోని లాల్ పానియా ప్రాంతంలో సీఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీసుల సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఎదురు కాల్పులు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఎస్‌ఎల్‌ఆర్, రెండు ఇన్సాస్ రైఫిల్స్, ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.


