![]()
పినపాక, మన భద్రాద్రి న్యూస్, జులై 01
మండలంలోని ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లో గత 25 ఏళ్లుగా పండ్ల దుకాణం నడుపుకుంటున్న ఓ దళిత మహిళపై అమానుషంగా దాడి జరిగిన ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్డులో పండ్ల దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఎల్చిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వల్లేపోగు పార్వతి అనే మహిళ ఆర్ అండ్ బీ రోడ్డు పక్కనే ఉన్న ఓ చెట్టు కింద తోపుడు బండిలో పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. ఇది గిట్టని ఓ వ్యక్తి తన దుకాణం ఎదురుగా కూర్చుని అమ్ముకుంటోందనే అక్కసుతో ఆ గిరిజనేతర వ్యక్తి ఆమెపై కర్ర
తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ సంఘటన సభ్య సమాజాన్ని తల దించుకునేలా చేస్తోంది.
మహిళలపై జరుగుతున్న దాడుల పట్ల ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకుంటామని ఓ వైపు చెబుతున్నా ఇలా దాడులకు తెగబడి ఓ దళిత మహిళ అని కూడ చూడకుండా ఇలా దాడి చేయడం పట్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటివి ఘటనలు మళ్ళీ జరగకుండా పోలీసులు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


