![]()
- ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా అనంతరం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కు వినతి పత్రం
ఖమ్మం, మన భద్రాద్రి బ్యూరో
వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు దివ్యాంగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట విహెచ్పిఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు బొజ్జ జీవరత్నం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విహెచ్పిఎస్ జాతీయ మహిళా అధ్యక్షురాలు సామినేని భవాని చౌదరి పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు దివ్యాంగులకు ఆసరా పింఛన్ రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, అలాగే ఆరు గ్యారంటీల పథకంలో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించాలని, బస్సు సౌకర్యం, డబల్ బెడ్ రూమ్స్, ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, తెల్ల రేషన్ కార్డులు అమలులో వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే బ్యాక్ లాగ్ ఉద్యోగాలు ప్రతి శాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, పెండింగ్ లో ఉన్న ఆసరా పెన్షన్ మొత్తాన్ని ఇవ్వాలని ఎటువంటి స్కార్టి లేకుండా సంక్షేమ రుణాలు ఇచ్చి వికలాంగుల చిరు వ్యాపారం కోసం ప్రభుత్వ స్థలాలు కేటాయించి మౌలిక వసతులు కల్పించాలని, వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు , విహెచ్పిఎస్ జిల్లా కో- ఆర్డినేటర్ తురుగంటి అంజయ్య మాదిగ, నగర అధ్యక్షులు తురుగంటి రాము మాదిగ, ఎమ్మార్పీఎస్ నగర అధ్యక్షులు భాకి శ్రీను మాదిగతో కలిసి అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాలకీడు సీతారాములు, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూలక్ష్మి, జిల్లా అధికార ప్రతినిధి గుడిబండ్ల సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఇనుప ఉపేందర్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీను, ఎంజెఎఫ్ జిల్లా నాయకులు మాగంటి శివకుమార్, జిల్లా నాయకులు తురుగంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


