![]()
మణుగూరు, మన భద్రాద్రి న్యూస్, జనవరి 21
మండలంలోని సమితి సింగారం గ్రామపంచాయితీ రామాలయం వీధికి చెందిన శ్రీలత హోటల్ యజమాని వెంకట్ రెడ్డి కుమారుడు దేవిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు వారి నివాసానికి వెళ్ళి దేవిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోల్లోజు అయోధ్య, నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కటబోయిన నాగేశ్వరరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్, కూచిపూడి బాబు, గణేష్ రెడ్డి, రాజేష్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


