![]()
దేశ రక్షణ లో ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు ఘన నివాళులు అర్పించిన సేవాలాల్ సేన.
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్
టేకులపల్లి మండల కేంద్రంలో సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్ అధ్యక్షతన టేకులపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం నుండి బోడు ఎక్స్ రోడ్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించి కొవ్వొత్తులతో ఘన నివాళులు అర్పించారు.పాకిస్తాన్ లో జరుగుతున్న యుద్ధంలో విరోచితంగా పోరాడుతూ అసువులు బాసిన అమరుడైన గిరిజన బిడ్డ మురళి నాయక్ అతని పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని అన్నారు. కుటుంబానికి 2 కోట్ల ఎక్స్రేషియా ప్రకటించాలని అలాగే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని భారత ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దాల్ సింగ్ నాయక్ ,టి ఎస్ టి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, ఉద్యోగ సంఘ రాష్ట్ర నాయకులు హత్తి రామ్ నాయక్, బిజెపి ఇల్లందు నియోజకవర్గ నాయకులు పుణ్య నాయక్ , బిఎస్ఎన్ఎల్ డి ఈ బానోత్ సక్రు నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూక్యా దేవా నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి రాథోడ్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి లావుగా వెంకటేష్ నాయక్, జిల్లా ప్రచార కార్యదర్శి జరపల లాలూ నాయక్, టేకులపల్లి మండల అధ్యక్షులు బానోత్ కిషన్ నాయక్, లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షులు బోడ బాలు నాయక్, మంగీలాల్ నాయక్, వీరు నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


