![]()
-సీపీఎం
ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్, జులై 04
సీపీఎం పార్టీ ఏర్పాటు చేసిన స్మారక సభలో పార్టీ మండల కార్యదర్శి ఎస్ఏ నభీ మాట్లాడుతూ భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆనాడు భూస్వాములకు, పెత్తందారులకు విసునూరు దేశ్ముకులకు, నైజాం దొరలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలను బలిదానం చేసిన దొడ్డి కొమరయ్య, అదేవిధంగా భారత దేశంలో బ్రిటీష్ ప్రభుత్వం మన శ్రమను, మన సంపదను దోచుకవెళ్తున్న వారికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి, గిరి పుత్రులను బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాట పటిమను నెలకొల్పి చివరకి తన గుండెను బ్రిటీష్ వారి తుపాకీ గుండుకు అడ్డం పెట్టీ అమరుడైన అల్లూరి సీతరామరాజులాంటి మహానుభావుల ఆశయాలను సాధించాలని అన్నారు. గురువారం దొడ్డి కొమరయ్య 78 వ వర్ధంతిని, అల్లూరి సీతారామరాజు 127 వ జయంతిని పురస్కరించుకొని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆలేటి కిరణ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తాళ్లూరి కృష్ణ, మన్యం మోహన్ రావు, రాందాస్, ఆర్బీజె రాజు, కాంతి, వైకుంఠం, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.


