![]()
చర్ల, మన భద్రాద్రి న్యూస్, జూన్ 30
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే చర్ల మండల కేంద్రంలోని పాత చర్ల నుండి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిలో ఆదివారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఉప్పరిగూడెం గ్రామానికి చెందిన యువకుడు బుటారి ప్రశాంత్, క్రాంతిపురం గ్రామానికి చెందిన సోడి రమేష్ ల తలలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న స్థానికులు క్షతగాత్రులను వెంటనే ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


