Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

Loading

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

  • ఎమ్మెల్యే పాయం

బూర్గంపహాడ్, ఏప్రిల్ 21, ప్రభాత వార్త

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని పాయం వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. బూర్గం పహాడ్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసిన వెంటనే నగదు తోపాటు బోనస్ అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు. రైతులు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు .తక్షణమే అధికారులను చరవాణి ద్వారా సంప్రదించండి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. మనది రైతు ప్రభుత్వమని ఆరుగాలం పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని బోనస్ కూడా అందిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమం లో పార్టీ మండల అధ్యక్షుడు దుగ్గంపూడి కృష్ణారెడ్డి, మాజీ జెడ్పిటిసి బట్ట విజయ్ గాంధీ, పినపాక నియోజకవర్గం బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి, మాజీ ఉపసర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి మాజీ ఎంపీపీ కైపు రోసిరెడ్డి, యువజన నాయకుడు సతీష్ , భజన ప్రసాద్ కైపు శ్రీనివాస్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ మందా నాగరాజు గుండె వెంకన్న, చిప్ప రాజు ,దాసరి సాంబ, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page