![]()
నర్సాపురం లో దొంగల హల్చల్ బైకు చోరీ
జూలూరుపాడు, మన భద్రాద్రి న్యూస్ జులై 23
మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామంలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బైక్ చోరీ కి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన లేళ్ళ సత్యనారాయణ రెడ్డి ఇంట్లో పార్క్ చేసి ఉన్న హీరో హోండా గ్లామర్ రెడ్ కలర్ బైకును దుండగులు సుమారు 11 గంటల సమయంలో చోరీ చేశారని, ఇట్టి విషయంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చెయ్యనున్నట్లు తెలిపారు. మండలంలో వరస దొంగతనాలతో గత సంవత్సరం నుండి ప్రజలు బంబేలుచుతున్నారు. దేవాలయ హుండీలు, రైతు వేదికల ఫర్నిచర్, ఇండ్లలో డబ్బులు, బైకులు, చివరకు వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైర్, బిఎస్ఎన్ఎల్ టవర్ బ్యాటరీలు సైతం లూటీ చేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. కానీ పోలీసులు ఒక్క కేసును కూడా చేదించకపోవడం బాధాకరం. ఇకనైనా దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి దొంగల బారి నుండి కాపాడాలని మండల ప్రజలు పోలీస్ శాఖను కోరుతున్నారు.


