Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemనిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

Loading

  • భూక్య రాంపండు,
    బీజేవైఎం మండల అధ్యక్షులు

చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, జూన్ 03

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండలంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ చండ్రుగొండ మండల బీజేవైఎం అధ్యక్షులు భూక్య రాంపండు ఆధ్వర్యంలో చండ్రుగొండ మండల తహసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా భూక్య రాంపండు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం నిరుద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిందని, నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు పక్కనపెట్టి చోద్యం చూస్తుందని అన్నారు. అందుకనే తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే 25 వేల ఉద్యోగం నోటిఫికేషన్ ద్వారా మెగా డీఎస్సీ ని నిర్వహించాలని, ప్రస్తుత డీఎస్సీ పరీక్షను 90 రోజుల పాటు వాయిదా వేయాలని, గ్రూప్ -1 పరీక్షలో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని, గ్రూప్ 2 నోటిఫికేషన్ లో అదనంగా పోస్టులను మంజూరు చేయాలని, అన్ని ఉద్యోగ నియమాకాల్లో మహిళకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తహశీల్దార్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు భోగి కృష్ణయ్య, జిల్లా కిసాన్ మోర్చా నాయకులు నల్లమోతు రఘుపతిరావు, గుగులోతు మోహన్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శి జంగా సత్యనారాయణ రెడ్డి, మండల నాయకులు గడ్డం శ్రీను, గుగులోతు శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page