Wednesday, March 25, 2026
HomeNational Newsనిర్వహణ సమస్యలు.. 8 ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు

నిర్వహణ సమస్యలు.. 8 ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు

Loading

మన భద్రాద్రి వెబ్ డెస్క్: అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం తర్వాత నుంచి దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఈ దుర్ఘటనను మరవకముందే సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు బయటపడటం కలవరపెడుతోంది.

మరోవైపు, నిర్వహణ సమస్యలూ వెంటాడుతున్నాయి. దీని కారణంగా ఈ మధ్యకాలంలో పలు విమాన సర్వీసులు ఆలస్యమవుతున్నాయి. తాజాగా శుక్రవారం ఎనిమిది సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిరిండియా ప్రకటించింది. మెయింటెనెన్స్‌, కార్యాచరణ సమస్యల కారణంగా వీటిని రద్దు చేసినట్లు వెల్లడించింది.రద్దయిన విమాన సర్వీసులు ఇవే..దుబాయ్‌ నుంచి చెన్నై రావాల్సిన ఏఐ906దిల్లీ నుంచి మెల్‌బోర్న్‌ వెళ్లాల్సిన ఏఐ308మెల్‌బోర్న్‌ నుంచి దిల్లీ రావాల్సిన ఏఐ309దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ రావాల్సిన ఏఐ2204పుణె నుంచి దిల్లీ వెళ్లాల్సిన ఏఐ874అహ్మదాబాద్‌ నుంచి దిల్లీ వెళ్లాల్సిన ఏఐ456హైదరాబాద్‌ నుంచి ముంబయి వెళ్లాల్సిన ఏఐ2872చెన్నై నుంచి ముంబయి వెళ్లాల్సిన ఏఐ571క్షమాపణలు చెప్పిన ఎయిరిండియానిర్వహణ సమస్యల కారణంగా జులై రెండోవారం వరకు తమ అంతర్జాతీయ విమాన సర్వీసులను 15 శాతం తగ్గించనున్నామని ఎయిరిండియా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 16 అంతర్జాతీయ మార్గాల్లో విమాన సర్వీసులను తగ్గించినట్లు కంపెనీ ప్రకటించింది. జూన్‌ 21 నుంచి జులై 15 వరకు ఈ సర్వీసుల తగ్గింపు కొనసాగుతుందని విమానయాన సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉత్తర అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియాల్లోని నగరాలకు వెళ్లే సర్వీసులపై ఈ ప్రభావం పడనుంది. మరోవైపు దిల్లీ-నైరోబి, అమృత్‌సర్‌-లండన్‌, గోవా-లండన్‌ సర్వీసులను వచ్చే నెల 15 వరకు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. భారీగా ఉండే బోయింగ్‌ 777 విమానాల్లో మరింతగా తనిఖీలు చేపట్టనుండటం, ఇరాన్‌ గగనతల మూసివేతల కారణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. ప్రభావితమయ్యే ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page