Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemనూతన రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం

నూతన రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం

Loading

మణుగూరు, మన భద్రాద్రి న్యూస్

ముత్యాలమ్మ నగర్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం గ్రామస్థులకు హామీ ఇచ్చారు. స్థానికుల వినతి మేరకు ముత్యాలమ్మనగర్, సంతోష్ నగర్ లలో రూ.32 లక్షల విలువైన ముఖ్యమైన ఏరియాలని గుర్తించి ఏడు రోడ్లను నిర్మించగా, వాటిని అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పాయం ప్రారంభించారు. అనంతరం ముత్యాలమ్మ నగర్, సంతోష్ నగర్ లో మాజీ ఉప సర్పంచ్ తరుణ్ రెడ్డి, ఎంపీడీఓ, రెవెన్యూ, విద్యుత్, పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ అధికారులతో కలిసి గ్రామస్థులతో మాట్లాడి జరుగుతున్న శానిటేషన్ పనులు, చెత్త సేకరణ, వీధి లైట్లు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీధిలైట్లు వెలగడం లేవని, సరిపడా విద్యుత్ స్తంభాలు లేవని, డ్రైనేజీ వ్యవస్థ బాలేదంటూ, పాములు, విష కీటకాలు ఇంట్లోకి వస్తున్నాయంటూ తదితర సమస్యలు గ్రామస్థులు ఏకరువు పెట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page