![]()
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, ఏప్రిల్ 07
మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ నందు తోటకూరి జయంత్ కుమార్ నూతన స్టీల్, ఎలక్ట్రికల్ దుకాణాన్ని సోమవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడి ఉండకుండా చిన్న వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారాలు వరకు ప్రారంభించి వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. యువకులకు ఉపాధి కల్పించే విధంగా ఎదగాలని, యువత స్వయం ఉపాధి ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడుతుందని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు యువతకు ఉపాధికై రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు మాజీ సర్పంచ్ ఇస్లావత్ రెడ్డి నాయక్, ఇది గణేష్, పోషాలు, బండ్ల రజిని, బండ్ల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.


