![]()
నేడు, రేపు 8వ తెలంగాణ రాష్ట్ర దంత వైద్యుల వార్షిక సదస్సు
ఖమ్మం, మన భద్రాద్రి న్యూస్ బ్యూరో
ఇండియన్ డెంటల్ అసోసియేషన్ (ఐ డి ఏ) ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో 8వ తెలంగాణ రాష్ట్ర దంత వైద్యుల వార్షిక సదస్సును ఖమ్మం లోని ఎస్ఆర్ డిజి స్కూల్లో నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ ఛైర్మన్ డాక్టర్ కుతుంబాక శ్రీరామ్ , సెక్రటరీ డాక్టర్ నాగుబండి కిరణ్ కుమార్ తెలిపారు. ఖమ్మం లోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఖమ్మంలో తొలిసారిగా ఈ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సదస్సు ప్రారంభం కార్యక్రమానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోని సుమారు 2 వేల మంది దంత వైద్యులు హాజరు కానున్నారని తెలిపారు. దంత వైద్య రంగంలో నూతన, అత్యాధునిక శిక్షణ విధానాలను, ఆయా రంగాల్లోని ప్రముఖ నిష్ణాతులైన వైద్యులు వివరించనున్నట్లు తెలిపారు. దీనితో పాటు నూతన పరికరాలను ప్రదర్శించి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు దంత వైద్యులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వైద్యులు సిహెచ్ విఆర్ నాగేశ్వరరావు, డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, కిషోర్ గౌడ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.


