Tuesday, March 24, 2026
HomeHyderabadన్యూయార్క్‌ టైమ్స్ స్క్వేర్ తరహాలో హైదరాబాద్ లో " టీ స్క్వేర్‌ "

న్యూయార్క్‌ టైమ్స్ స్క్వేర్ తరహాలో హైదరాబాద్ లో ” టీ స్క్వేర్‌ “

Loading

హైదరాబాద్, మన భద్రాద్రి బ్యూరో

హైదరాబాద్ నగరంలో మరో ఐకానిక్ టవర్ రాబోతుంది. అమెరికాలోని న్యూయార్క్‌ లో ఫేమస్ అయిన టైమ్స్ స్క్వేర్ తరహాలో టీ స్క్వేర్‌ను నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్‌ టైమ్స్ స్క్వేర్ ఐకానిక్‌లా కనిపించే విధంగా తెలంగాణ స్క్వేర్ పేరుతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దాని కోసం తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) టెండర్లను ఆహ్వానించింది. నగరంలోని రాయదుర్గం, హైటెక్ సిటీ ప్రాంతాల్లో టీ స్క్వేర్ నిర్మాణం చేపట్టనుంది. టీ స్క్వేర్ ప్రాజెక్టు కోసం ఆగస్టు 9వ తేదీ వరకు బిడ్‌లను సమర్పించేందుకు చివరి తేదీని టీజీఐఐసీ ప్రకటించింది. ఆర్కిటెక్ కమ్ ట్రాన్సాక్షన్ అడ్వైజర్ ఎంపిక విధానం క్వాలిటీ కమ్ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ (క్యూసీబీసీ) అని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు లక్ష్యం సమాజానికి సౌకర్యవంతమైన, ఆకర్షణీయమైన వాతావరణాన్ని అందించడం అని తెలిపింది. కాగా, న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ గురించి అందరికీ తెలిసిందే. ఒక ప్రధాన వాణిజ్య కూడలి, ఫేమస్ పర్యాటక, వినోద కేంద్రం. వీడియో బిల్ బోర్డులతో ప్రకటనలతో 24 గంటలు ప్రకాశవంతంగా వెలిగిపోతుంది. ఇక్కడికి ప్రతి సంవత్సరం 50 మిలియన్ల మంది సందర్శిస్తుంటారు అని నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే టీ స్క్వేర్ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page