Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemపంటల వ్యాధులు, తెగులు నివారణకు పద్ధతులపై సమావేశం

పంటల వ్యాధులు, తెగులు నివారణకు పద్ధతులపై సమావేశం

Loading

పంటల వ్యాధులు, తెగులు నివారణకు పద్ధతులపై సమావేశం

టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్

టేకులపల్లి మండలంలోని ముత్యాలంపాడు క్రాస్ రోడ్ వద్ద గల రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రవేత్తలు, రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శాస్త్రవేత్తలు మామిడి తోటలో వచ్చే తెగులు, నివారణ, అధిక ఉష్ణోగ్రత వలన ప్రస్తుత పంటల్లో కలిగే మార్పుల గురించి వివరించడం జరిగింది. మామిడి తోటలో తేనే మంచు పురుగు వలన ఆకుపై భాగంలో మసిగా ఉండట వలన మొక్కలు చనిపోయే కోణం లో ఉన్నప్పుడు నివారణకు సోడియం హైడ్రోక్లోరెడ్ ద్రావణాన్ని, గంజి ద్రావణాన్ని కలిపి పిచికారి చేయడం వలన నల్లమసి గట్టిపడి రాలిపోతుందని తెలిపారు. చెట్ల మీద నీరు పిచికారి చేయడం వల్ల నల్ల మసి మొత్తం కారిపోతుంది.

పంటలకు పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా, రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండాలని, ఈమధ్య రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పంటల్లో ఎదుగుదల మార్పు కనిపిస్తుంది తెలిపారు. అదేవిధంగా డిసెంబర్ 15 లోపు యాసంగి వరి నాట్లు వేసుకునేలా చేయాలి. తద్వారా తొందరగా పొట్టకు రావడం, బెరుకు లు వచ్చే అవకాశం ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి.ఏ.ఓ.వి. బాబురావు, ఏ.డి.ఏ.పి.వాసవి రాణి, ఎం.ఏ.ఓ అన్నపూర్ణ, ఏ.ఈ.ఓ లు శ్రావణి, విశాల్, రమేష్, రెహానా, ప్రవీణ్, వంశీ, రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page