![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, జులై 03
గుండాల మండల కేంద్రంలోని గుండాల, శంభునిగూడెం, శెట్టుపల్లి గ్రామాలలో పలు కుటుంబాలను బుధవారం నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరామర్శించారు. మండల కేంద్రంలోని షేక్ జిలానీ బేగం, మండలోజు సత్యం, కొర్స నాగరాజు కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వారి నివాసాలకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.


