![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, ఫిబ్రవరి 20
మండలంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గురువారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య ఆరోగ్యం బాగోలేదని విషయం తెలుసుకుని జగ్గాయిగూడెం గ్రామంలో వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించి, అధైర్య పడదని, ఎలాంటి అవసరం ఉన్న మీకు నేను అందుబాటులో ఉంటానని తెలియజేయడం జరిగింది. అనంతరం గుండాల మండల కేంద్రానికి చెందిన దేవసాని లక్ష్మయ్య ఇటీవల అనారోగ్య కారణంతో మరణించిన విషయం తెలుసుకుని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి, లక్ష్మయ్య చిత్ర పటానికి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పీఎస్ఆర్ – పీవీఆర్ యువసేన కో – ఆర్డినేటర్ ఎస్కే ఖధీర్, ఏఎంసీ డైరెక్టర్ ఊకె బుచ్చయ్య, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, ముత్తాపురం మాజీ ఉప సర్పంచ్ పూనెం సమయ్య, మాజీ ఉప సర్పంచ్ మోకాళ్ళ శంకర్, పోలెబోయిన బాబురావు, జర్పుల సక్రు, ఎస్కే ఇస్రర్, బొంగు చంద్రశేఖర్, బాలకృష్ణ, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


