![]()
-పాఠశాల యాజమాన్యంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన విద్యార్థుల తల్లితండ్రులు
పాల్వంచ, మన భద్రాద్రి న్యూస్, జులై 03
పాల్వంచలోని నవభారత్ లోని పాఠశాల యాజమాన్యం 3, 4 వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులను ఉద్దేశపూర్వకంగా, అధిక ఫీజు చెల్లించనందుకు వారి తరగతి గది నుండి బలవంతంగా తీసుకువెళ్ళి లైబ్రెరీ రూంలో ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్బంధించిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఫీజు కట్టకపోతే పాఠశాలకు రావొద్దని బెదిరించారని
ఈ విషయాన్ని పిల్లలు తల్లిదండ్రులకు చెప్పగా, విద్యార్థుల తల్లిదండ్రులు చైల్డ్ అధికారులకు హెల్ప్ లైన్ లో కంప్లయింట్ చేశారు. చైల్డ్ అధికారులు ఎంక్వైరీ అంటూ నాలుగు రోజులుగా కాలయాపన చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. పిల్లలు పాఠశాలకు వెళ్ళమని ఆందోళన చెండుతున్నారని వారు తెలిపారు. అగమ్య గోచరంగా మారిన ఇద్దరు విద్యార్థుల భవిష్యత్ కోసం
చైల్డ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకొని, పిల్లల హక్కులు కాపాడాలని అధికారులను వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రిన్సిపాల్ పై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై న్యాయం కోసం జిల్లా కలెక్టర్ కు మంగళవారం ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి ప్రిన్సిపాల్ పై తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కలెక్టర్ ను కోరారు.


