Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemపామాయిల్ తోటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు

పామాయిల్ తోటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు

Loading

పామాయిల్ తోటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు.

టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, మే 21

బుధవారం చింతోని చల్క గ్రామంలో ఉద్యానవనశాఖ మరియు వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో గోద్రేజ్ ఆగ్రో వెట్ కంపెనీ వారు పామాయిల్ సాగుపై అవగాహన కల్పించారు.
పామాయిల్ మొక్కలు ఎకరానికి 57మొక్కలు వేసుకోవాలి సాగు చేసిన రైతులకు డ్రిప్ ఎస్సీ, ఎస్టి రైతులకు 100% సబ్సిడీ, బిసి రైతులకు – 90%, ఓసి రైతులకు 80% సబ్సీడిపై ఇస్తారని.
మూడు సంవత్సరాల వరకు ఎకరానికి 4200 రూ చొప్పున రైతు ఖాతాలో జమ చేస్తారని తెలియజేశారు.
ప్రస్తుతానికి టేకులపల్లి మండలంలో 800 ఎకరాలు విస్తీర్ణం లో పామాయిల్ సాగు చేస్తున్నారు. పామాయిల్ మొక్క 30 సంవత్సరాల వరకు గెలలు వస్తాయి గనుక నికర అధిక ఆదాయం ఉంటుందని కావున రైతులు పామాయిలో సాగు చేస్తూ అంతర పంటగా మునగ సాగు చేయాలని వారు రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, జిల్లా ఉద్యాన వనశాఖ అధికారి జే. కిషోర్ , ఏడిఏ లాల్ చంద్ ,
ఎంఏఓ అన్నపూర్ణ హెచ్ఓ స్రవంతి, ఏఈవో రెహనా, జైన్ ఇరిగేషన్ మేనేజర్ మరియు రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page