![]()
- పాస్టర్ జి రాజు రామ్ చందర్ డిమాండ్
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కారకులను శిక్షించాలని టేకులపల్లి మండల పాస్టర్ ఫెలోషిప్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ జి రాజు రామ్ చందర్ డిమాండ్ చేశారు. ఆదివారం పెంతే కోస్తూ ప్రార్థన మందిరంలో నిర్వహించే సందర్భంగా పగడాల ప్రవీణ్ కుమార్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు దేవుడు ఓదార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ టి బోయాజ్, కనకరాజు, చంద్రయ్య, కోటేష్, నరేష్, కృష్ణ, జెర్మియా, విష్ణు, యువరాజ్, హర్ష, సోనీ, అరుణ, విజయశాంతి, మణి, భారతి, సరూప, లుదియా, తదితరులు పాల్గొన్నారు.


