![]()
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, జూలై 15
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మంగళవారం తన మిత్ర బృందంతో హైదరాబాద్ లోని మంత్రి నివాసములో మర్యాద పూర్వకంగా కలిశారు. పలువురు నాయకులు మంత్రిని కలిసి జిల్లాలోని పలు సమస్యలను చర్చించారు. ఈ కార్యక్రమంలో బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్ రావు, నియోజకవర్గ నాయకులు,కోరం సురేందర్, , ఆత్మ కమిటీ చైర్మన్ బోడ మంగీలాల్ నాయక్, మండల నాయకులు ఈది గణేష్, ఇస్లావత్ రెడ్యానాయక్, గడ్డం మధురెడ్డి,దళపతి శ్రీనివాస్ రాజు, భద్రు నాయక్, పోషాలు, భద్రం, రవి నాయక్, సర్దార్, ఇస్తారీ, లక్ష్మీనారాయణ, వేణు తదితరులు పాల్గొన్నారు.


