Tuesday, March 24, 2026
HomeTelangana Newsప్రజా భవన్‌లో దరఖాస్తుల వెల్లువ

ప్రజా భవన్‌లో దరఖాస్తుల వెల్లువ

Loading

ప్రజా భవన్‌లో దరఖాస్తుల వెల్లువ

హైదరాబాద్, మన భద్రాద్రి న్యూస్ బ్యూరో

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ లోని మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్‌ లో నిర్వహిస్తున్న ప్రజావాణికి దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఈ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ తెల్లవారుజాము నుంచే తమ సమస్యలు తెలుపడానికి అర్జీలతో ప్రజలు భారీగా క్యూలు కట్టారు. దీంతో పోలీసులు బందోబస్తు పటిష్టం చేశారు. ముఖ్యంగా ధరణి భూముల సమస్య, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, 317 జీవో రద్దు, వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు లాంటి తదితర అంశాలపై ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికారులు అర్జీలను తీసుకుని పంపిస్తున్నారు. ప్రజావాణిలో అర్జీలు పెట్టుకున్న తమకు న్యాయం జరగడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page