![]()
దమ్మపేట, మన భద్రాద్రి న్యూస్
మండలంలోని నల్లకుంట రహదారి మార్గం వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. భారీ వాహనాలు ప్రయాణిస్తున్న సమయంలో ద్విచక్ర వాహనదారులు తరచుగా ప్రమాదాలకు గురవుతున్నారు. రహదారి మార్గంలో ప్రమాదాలు జరగకుండా ఇరువైపులా మట్టి పోయించాలని నల్లకుంట గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మత్తులు చేయాలని వాహనదారులు, గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.


