![]()
-మండలంలో 70 శాతం ఓటింగ్
గుండాల, మన భద్రాద్రి న్యూస్, మే 27
మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఖమ్మం – వరంగల్ – నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండల వ్యాప్తంగా 70 శాతం ఓటింగ్ నమోదు అయింది. మండల వ్యాప్తంగా మొత్తం పట్టభద్రులు 443 మంది ఓటు హక్కును కలిగి ఉండగా, 312 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన వారిలో పురుషులు 204 మంది, స్త్రీలు 108 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


