![]()
ఏపీ, మన భద్రాద్రి వెబ్ డెస్క్: ఫేస్బుక్ స్నేహం..యువకుడి ఆత్మహత్యాయత్నానికి దారితీసింది. సేకరించిన వివరాల ప్రకారం గుడివాడ మండలం తటివర్రు గ్రామానికి చెందిన యువకుడు కొల్లూరి సంపత్‌కుమార్‌కు ఫేస్ బుక్ ద్వారా ఒక యువతి పరిచయమైంది.
ఆమెతో నిత్యం ఫేస్బుక్ ద్వారా చాటింగ్ చేసేవాడు. ఇటీవల సదరు యువతి సంపత్తో సరిగా మాట్లాడడం లేదు. పెళ్లి చేసుకుందామని చెప్పిన ఆమె అందుకు నిరాకరించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై సంపత్‌కుమార్ గడ్డి మందు తాగి గురువారం ఆత్మహత్యకు యత్నించాడు. విషయం అతని స్నేహితుడు యువరాజుకు తెలిపాడు. దీంతో అతనిని వెంటనే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


