Tuesday, March 24, 2026
HomeTelangana Newsబాధితులకు సత్వర న్యాయం అందించాలి

బాధితులకు సత్వర న్యాయం అందించాలి

Loading

బాధితులకు సత్వర న్యాయం అందించాలి

జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ రాజు ఐపీఎస్

వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ కి వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ రాజు ఐపీఎస్ అన్నారు. గురువారం బూర్గంపాడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా స్టేషన్ లోని పరిసరాలు ప్రాంతాలను, వివిధ కేసులపై స్టేషన్ కు తీసుకువచ్చిన వాహనాలను ఆయన పరిశీలించారు. అనంతరం స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. వివిధ సమస్యలపై స్టేషన్కు వచ్చే ప్రజలకు సత్వర న్యాయం అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఈ రాజేష్, అదనపు ఎస్ఐ ఎస్సై నాగ బిక్షం, ట్రైనీ ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page