![]()
బూర్గంపహాడ్ మండల ప్రజలకు విజ్ఞప్తి
బూర్గంపహాడ్, మన భద్రాద్రి న్యూస్
నేడు, రేపు అనగా 20, 21వ తేదీల్లో ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ నందు ఉండి 18 సంవత్సరాలు పూర్తి అయిన వారి నుండి ఫామ్ 6 ద్వారా ఓటు హక్కు కల్పించుట మరియు ఫామ్ -7 ద్వారా తొలగింపులు, ఫామ్ – 8 ద్వారా ఏదైనా సవరణలు చేసేందుకు దరఖాస్తులు స్వీకరింస్తూ స్పెషల్ క్యాంపైన్ డే గా నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుండి అధికారులకు, తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పినపాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండల ప్రజలను ఒక ప్రకటనలో కోరారు.


