Wednesday, March 25, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemభద్రాచలం ట్రాఫిక్ పోలీసులకు హెల్మెట్లు, కళ్ళజోళ్ళు పంపిణీ

భద్రాచలం ట్రాఫిక్ పోలీసులకు హెల్మెట్లు, కళ్ళజోళ్ళు పంపిణీ

Loading

భద్రాచలం ట్రాఫిక్ పోలీసులకు హెల్మెట్లు, కళ్ళజోళ్ళు పంపిణీ

భద్రాచలం, మన భద్రాద్రి బ్యూరో

భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న 20 మంది పోలీస్ సిబ్బందికి మంగళవారం భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐ మధు ప్రసాద్, టౌన్ సిఐ సంజీవరావు చేతుల మీదుగా హెల్మెట్లు , కళ్ళజోడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో నిర్వహించగా, కార్యక్రమాన్ని ఉద్దేశించి టౌన్ సీఐ సంజీవరావు మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్లు విధిగా ఉపయోగించాలని మరియు అందరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు.

అదే విధంగా పోలీసుల్ని ఉదాహరణకు తీసుకొని ప్రజలు కూడా ద్విచక్రాన్ని నడిపే సమయంలో హెల్మెట్లు ఉపయోగిస్తారని ఆయన తెలిపారు. వేసవి కాలంలో రోడ్డుపై విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు ఇబ్బంది లేకుండా విధుల సమయంలో వేడి నుండి తప్పించుకోవడానికి కూలింగ్ గ్లాస్ లను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ట్రాఫిక్ ఎస్ఐ మధు ప్రసాద్ ను సిఐ సంజీవ రావు అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page